Narendra Modi: దక్షిణాదివారు ఆఫ్రికన్లలా ఉంటారన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

PM Retort To Sam Pitroda Racist Flub

  • శరీరం రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అని నిలదీత
  • చాలామంది ప్రజల రంగు నలుపుగా ఉంటుందని వెల్లడి
  • శ్రీకృష్ణుడి రంగు కూడా నల్లగానే ఉంటుందని వ్యాఖ్య
  • శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరిక

దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూసి ప్రజలను అవమానిస్తారా? అని నిలదీశారు. చాలామంది ప్రజల శరీరం రంగు నలుపుగా ఉంటుందన్నారు. దాని ఆధారంగా యోగ్యతను నిర్ణయిస్తారా? అన్నారు.

శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని గుర్తుంచుకోవాలన్నారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈశాన్య ప్రజలు చైనీయుల్లా, దక్షిణాదివారు ఆఫ్రికన్లలా కనిపిస్తారని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Narendra Modi
Sam Pitroda
Congress
BJP
  • Loading...

More Telugu News