Naresh: అప్పటి నుంచే నేను జనసేన పార్టీకి గట్టి మద్దతుదారుడ్ని: నరేశ్

Senior actor Naresh says he is a steadfast supporter of Janasena Party

  • జనసేన పార్టీ ఆవిర్భావం నుంచే తాను మద్దతుదారుడ్నని నరేశ్ వెల్లడి
  • పవన్ నాయకత్వంతో స్ఫూర్తి పొందాననని వివరణ
  • మీ ఆశయసిద్ధి కోసం వెంట నిలుస్తామంటూ ట్వీట్

జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇవాళ ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 

"డియర్ పవన్ కల్యాణ్.... జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను మీ పార్టీకి గట్టి మద్దతుదారుడిగా ఉన్నాను. మీ నాయకత్వం, ఏపీ పట్ల మీ దార్శనికత నాలో స్ఫూర్తిని రగిలించాయి. మీ ప్రస్థానం ఒక ఆశా కిరణం. మీ ఆశయ సిద్ధి కోసం మేం ఐక్యంగా మీ వెంట నిలుస్తాం" అంటూ నరేశ్ ట్వీట్ చేశారు. 

ఇటీవల పవన్ కల్యాణ్ ఓ ప్రసంగం సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సమయంలోనూ... పవన్ కు నరేశ్ మద్దతుగా నిలిచారు.

More Telugu News