: పాకిస్థాన్ టాపార్డర్ నడ్డి విరిచిన రోచ్, నరైన్: పాక్ 131/7
ఛాంపియన్స్ లీగ్ లో పాకిస్థాన్ కు విండీస్ చుక్కలు చూపిస్తోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు పాక్ బ్యాట్స్ మన్ ను క్రీజులో కుదురుకోనివ్వడం లేదు. నిప్పులు చెరిగే బంతులతో కీమర్ రోచ్, సునీల్ నరైన్ పాకిస్థాన్ జట్టు టాపార్డర్ ను కూల్చేశారు. కేవలం 128 పరుగులకే 7 వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ పతనానికి నాంది పలికారు. రోచ్, నరైన్ చెరో మూడు వికెట్లు తీసి పాక్ ను కట్టడి చేసారు. వీండీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ జట్టు 37 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది.