Tejashwi Surya: హైదరాబాద్‌లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య ఎన్నికల ప్రచారం

Tejaswi Surya campaign in Hyderabad

  • హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో తేజస్వి ప్రచారం
  • కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లో ఓటర్లు, అభిమానులు, యువతను కలిసిన బీజేపీ ఎంపీ
  • తన హైదరాబాద్ పర్యటనపై ట్వీట్ చేసిన తేజస్వి సూర్య

బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ అభ్యర్థులు మాధవీలత, కిషన్ రెడ్డిల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లో ఓటర్లు, అభిమానులు, యువతను కలిశారు.

ట్వీట్ చేసిన తేజస్వి సూర్య

తన హైదరాబాద్ పర్యటనపై తేజస్వి సూర్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వర్షాన్ని తట్టుకుని వందలాది మంది ఉత్సాహవంతులైన యువకులు నారాయణగూడలోని కేఎంఐటీ కళాశాలలో జరిగిన 'లెట్స్ ఓట్ క్యాంపెయిన్'లో పాల్గొన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

జాతీయ విద్యా విధానం, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల గురించి వివరించినట్లు తెలిపారు. యువతకు సాధికారత, నైపుణ్యాన్ని పెంపొందించడంలో కేంద్రం చిత్తశుద్ధిని వారికి వివరించినట్లు చెప్పారు. ప్రగతి, అభివృద్ధి వైపు ప్రయాణాన్ని కొనసాగడానికి మోదీ 3.0కు మద్దతివ్వాలని... అందుకు అందరూ చేయి కలపాలని ఫస్ట్ టైమ్ ఓటర్లకు తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Tejashwi Surya
BJP
Hyderabad
Lok Sabha Polls
  • Loading...

More Telugu News