Anajali: ఆహాలో అడుగుపెడుతున్న 'గీతాంజలి మళ్లీ వచ్చింది'

Geethanjali Malli Vachindi OTT release date confirmed

  • ఏప్రిల్ 11న విడుదలైన 'గీతాంజలి మళ్లీ వచ్చింది
  • కెరియర్ పరంగా అంజలికి ఇది 50వ సినిమా 
  • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్  


అంజలి 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా రూపొందింది. గతంలో వచ్చిన 'గీతాంజలి' సినిమాకి ఇది సీక్వెల్. క్రితం నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, వీకెండ్ సమయానికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

మొదటి భాగంలో బ్రహ్మానందం .. రావు రమేశ్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. తనని చంపిన విలన్ పై గీతాంజలి ప్రతీకారం తీర్చుకుంటుంది. అది మనసులో పెట్టుకున్న ఆ విలన్ తనయుడు, గీతాంజలి చెల్లెలిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గీతాంజలి ప్రేతాత్మ ఏం చేస్తుంది? చివరికి జరిగేదేమిటి? అనేది కథ. 

మొదటి భాగంలో ఉన్న ఆర్టిస్టులతో పాటు సునీల్ .. రవిశంకర్ .. సత్య వంటివారు ఈ సీక్వెల్ లో కనిపిస్తారు. ఫస్టు పార్టులో కామెడీ .. హరర్ ఈ రెండింటినీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. కానీ సెకండ్ పార్టు విషయానికి వచ్చేసరికి, ఆ స్థాయి శ్రద్ధ పెట్టినట్టుగా అనిపించదు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.

More Telugu News