Kovai Sarala: అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకుంటా: కోవై సరళ

Kovai Sarala Interview

  • హాస్యనటిగా తనదైన మార్క్ చూపించిన కోవై సరళ
  • తెలుగు .. తమిళ భాషల్లో ఆమె చాలా బిజీ 
  • పూరి డైరెక్షన్ ఇష్టమని వెల్లడి 
  • ఈ రోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్


కోవై సరళ .. తెలుగు సినిమా హాస్యాన్ని తనదైన స్టైల్లో పరిగెత్తించిన నటి. తమిళ .. తెలుగు భాషల్లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో శ్రీలక్ష్మి తరువాత .. ఆ స్థాయి హాస్యంతో ఆకట్టుకున్న నటి ఆమె. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఆమె ఈ వేదిక ద్వారా ప్రస్తావించారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. 

అప్పట్లో కమల్ హాసన్ గారి సినిమాలో హీరోయిన్ గా తనకి ఛాన్స్ రావడం గొప్ప అదృష్టమనీ, తన కోసం ఆయన 3 నెలల పాటు వెయిట్ చేయడం గొప్ప విషయమని చెప్పారు. తన అభిమాన దర్శకుడు పూరి అనీ, 'దేశముదురు' సినిమా తనకి మంచిపేరు తెచ్చిపెట్టిందని అన్నారు. తెలుగులో మీకు నచ్చిన కమెడియన్ ఎవరు?' అనే అలీ ప్రశ్నకి సమాధానంగా 'మీరే' అన్నట్టుగా ఆమె ఓరగా చూశారు. 

తాను పెళ్లి చేసుకోలేదనీ, తప్పకుండా చేసుకోవాలనేం లేదుకదా అని అన్నారు. 'ఒకవేళ కోవై సరళ పెళ్లి చేసుకోవాలనుకుంటే, 'ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో ఎవరు కావాలి?' అని అలీ అడిగారు. అందుకు ఆమె నవ్వేస్తూ 'అల్లు అర్జున్' అంటూ తనదైన స్టైల్లో చెప్పారు. 'ఓ పుష్ప కావాలా?' అంటూ మరింత నవ్వించారు అలీ. సరదాగా సాగే ఫుల్ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. 

Kovai Sarala
Actress
Ali
  • Loading...

More Telugu News