Heat Islands: హైదరాబాద్ లో ఏడు హీట్ ఐలాండ్స్.. అర్బన్ ల్యాబ్ సంస్థ నివేదిక

Areas concentrated with Urban Heat Islands in Hyderabad

  • మార్చిలో ఆ ఏడు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
  • గూగుల్ ఎర్త్, భూ ఉపగ్రహ ఉష్ణోగ్రతల సమాచార విశ్లేషణ
  • అక్కడ సుమారు 49 డిగ్రీల టెంపరేచర్ ఉండొచ్చని అంచనా

హైదరాబాద్ సిటీ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని తాజా పరిశోధనలో తేలింది. ఆ ఏడు ప్రాంతాలు అర్బన్ హీట్ ఐలాండ్స్ గా మారాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. పరిశోధనలో భాగంగా గూగుల్ ఎర్త్, భూ ఉపగ్రహ ఉష్ణోగ్రతల సమాచారాన్ని నిశితంగా పరీక్షించామని పేర్కొన్నారు.

మార్చిలో నగరవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో నేలపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అర్బన్ ల్యాబ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డి నగర్‌, మన్సూరాబాద్‌, పటాన్‌చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో నేలపై సుమారు 49 డిగ్రీల టెంపరేచర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. ఈ ఏడు ప్రాంతాలను అర్బన్ హీట్ ఐలాండ్స్ గా పేర్కొన్నారు. ముందుముందు ఇవి మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారిపోతోందని, దాని ఫలితమే ఈ హీట్ ఐలాండ్స్ అని చెప్పారు. చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తేగానీ ఈ పరిస్థితిని మార్చలేమని హెచ్చరించారు.

More Telugu News