T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్ కోసం ఉగాండా స్క్వాడ్ ప్రకటన.. 43 ఏళ్ల ఆటగాడికి జట్టులో చోటు!
- వెస్టిండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో ఐసీసీ టోర్నీ
- పొట్టి ప్రపంచకప్ కోసం ఉగాండా ప్రకటించిన జట్టులో 43 ఏళ్ల ఫ్రాంక్ సుబుగాకు చోటు
- ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న ఉగాండా
మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే చాలా జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి. తాజాగా ఉగాండా కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచ కప్ లో ఆడబోతున్న ప్లేయర్ గా ఉగాండా ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా నిలవనున్నాడు.
ఇక ఉగాండా తొలిసారి ఈ మెగా టోర్నీలో పాల్గొంటోంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఉగాండా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో 43 ఏళ్ల సుబుగాకు కూడా స్థానం దక్కడం విశేషం. బ్రయాన్ మసాబా సారథ్యంలో ఉగాండా బరిలోకి దిగనుంది. కాగా, ఆఫ్రికా క్వాలిఫయర్స్ రీజనల్‌లో ఫైనల్‌లో ఉగాండా రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచ కప్కు అర్హత సాధించడం జరిగింది. గ్రూప్-సీలో ఉన్న ఈ జట్టు తన మొదటి మ్యాచ్‌ను జూన్ 3న ఆఫ్గనిస్థాన్‌తో తలపడనుంది.
ఉగాండా స్క్వాడ్: బ్రయాన్ మసాబా, కెన్నెత్ వైస్వా, రిజాత్ అలీ షా, ఫ్రాంక్ సుబుగా, దినేశ్ నక్రాని, రోజర్ ముకాసా, రోనక్ పటేల్, బిలాల్ హసున్, కోస్మాస్ క్యెవుటా, రాబిన్సన్ ఒబుయా, ఫ్రెడ్ అచెలమ్, హెన్నీ సెన్యోండో, సిమోన్ సెసాజి, జుమా మియాజి. అల్పేష్ రాజ్‌మణి.