: రెచ్చగొట్టేలా దుస్తులొద్దు: మహిళలకు చైనా పోలీసుల సూచన


లైంగిక నేరాలను అరికట్టేందుకు చైనా పోలీసులు నడుంబిగించారు. జబ్బలు కనిపించేలా టాప్స్, ఊరువులు ప్రదర్శితమయ్యేలా మినీలు, మైక్రోమినీలు, హాట్ పాంట్లు ధరించవద్దంటూ మహిళలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా సిటీ బస్సులు, లోకల్ రైళ్ళలో ప్రయాణించేటపుడు అతివలు అత్యంత జాగరూకతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులేసుకుని బస్సులోపలి హై డెక్ పై కూర్చున్నపుడు.. లోయర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రబుద్ధులు సెల్ ఫోన్లలో వారి అందాలను చిత్రీకరించే ప్రమాదం ఉందని పోలీసులు అంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అలా కూర్చోవాల్సి వస్తే.. వంటికి హ్యాండ్ బ్యాగులు, మ్యాగజైన్లు అడ్డుగా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ మేరకు వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News