Narendra Modi: నా ప్రియమిత్రుడు చంద్రబాబుకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ ట్వీట్

PM Modi thanked Chandrababu

  • నేడు ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ
  • రాజమండ్రి, అనకాపల్లి సభలకు హాజరు
  • సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికిన చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోదీ పాటు పురందేశ్వరి, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ పాల్గొనగా... అనకాపల్లి సభలో మోదీతో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. 

కాగా, మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఆయనకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికారు. మోదీ రాజమండ్రి వస్తున్న సమయంలో చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో ఉన్నారు. ఏపీ ప్రజలు మీ రాక కోసం, మీ ఉత్తేజభరిత ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

అందుకు ప్రధాని మోదీ కూడా ఓ ట్వీట్ ద్వారా బదులిచ్చారు. "నా ప్రియమిత్రుడు చంద్రబాబుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఎన్డీయే కూటమి సభలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్నాను. ఆ తర్వాత అనకాపల్లిలో మరో సభ ఉంది. ఏపీ మద్దతు మొత్తం ఎన్డీయేకే!" అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Narendra Modi
Chandrababu
NDA
BJP
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News