Posani Krishna Murali: ఎంతవరకూ వెళ్లాలో అంతవరకు మాత్రమే వెళ్లాలి: పోసాని

Posani Interview

  • అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదని వెల్లడి 
  • ఆకర్షణలు సహజమని వ్యాఖ్య 
  • కొన్ని పరిధులు దాటకూడదని వివరణ  


రచయితగా .. దర్శక నిర్మాతగా పోసాని కృష్ణమురళికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఆయనకి అలవాటు. అది అప్పుడప్పుడు గాలివానలా మారినా ఆయన తట్టుకుని నిలబడ్డారు. ఒక వైపున సినిమాల్లో కనిపిస్తూనే, మరో వైపున రాజకీయాల గురించి మాట్లాడుతూ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నాకు 60 ప్లస్ .. మా ఆవిడకి 60 .. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడటం వలన నాకు అదనంగా కలిసొచ్చేది ఏమీ లేదు. మొదటి నుంచి కూడా నాకు మందు అలవాటు లేదు. అలాగే లవర్స్ కూడా ఎవరూ లేరు. ఆడవారికి ఆకర్షించే గుణం ఉంటుంది. మగవారికి చలించే గుణం ఉంటుంది. ఎంతవరకూ చలించాలంటే మన జీవితం నాశనం కానంతవరకూ. అవతల ఆ అమ్మాయి జీవితం నాశనం కానంతవరకూ. అంతవరకూ చలించవచ్చు" అని అన్నారు. 

"ప్లస్ - మైనస్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఆ ఆకర్షణ అనేది కొన్ని పరిమితులను దాటనిదై ఉండాలి. ఇలాంటి ఆకర్షణలు ఉండటం సహజం .. నాతో సహా. పోసాని ఏమైనా పైనుంచి ఊడిపడ్డాడా .. అమ్మకడుపులో నుంచే పడ్డాడు కదా. ఎంతవరకూ వెళ్లాలో అంతవరకు మాత్రమే వెళ్లాలి" అంటూ చెప్పారు. 

Posani Krishna Murali
Actor
Tollywood
  • Loading...

More Telugu News