Ponguleti Srinivas Reddy: కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టి తెలంగాణపై 7 లక్షల కోట్ల భారం మోపారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy fires at kcr

  • కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఉందని విమర్శ
  • పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ఆగ్రహం

కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టి తెలంగాణపై ఏడు లక్షల కోట్ల భారం మోపారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఉందని విమర్శించారు. కృష్ణా నీళ్లను ఆంధ్రకు ఇచ్చింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వంలో ఒక్క నిమిషం కరెంట్ పోవడం లేదన్నారు. 

పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాముల వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిందన్నారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోందన్నారు. బీజేపీకి 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని హెచ్చరించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Ponguleti Srinivas Reddy
Congress
BJP
KCR
  • Loading...

More Telugu News