Botsa Satyanarayana: మిస్టర్ మోదీ... ఈ విషయాలను స్పష్టం చేయకపోతే మీరు కపట నాటక సూత్రధారి అని తేలిపోతుంది: మంత్రి బొత్స

Botsa comments on PM Modi

  • నేడు ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
  • చంద్రబాబు మోసపూరిత పాయింట్లతో పాటు, పొత్తు అజెండా ప్రకటించాలన్న బొత్స
  • లేకపోతే మీరు న్యాయం లేనివారి కిందే లెక్క అంటూ ట్వీట్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో, మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోసగాడు చంద్రబాబు చెబుతున్న ఐదు మోసపూరిత పాయింట్లతో పాటు, బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుల అజెండాను కూడా మోదీ ప్రకటించాలని ఏపీ కోరుతోందని బొత్స పేర్కొన్నారు. 

1. నాలుగు శాతం ముస్లిం ఓబీసీ కోటాను ఉంచాలి
2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు 
3. ఏపీలో సీఏఏ/ఎన్ఆర్ సీ ఉండకూడదు
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
5. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి

మిస్టర్ మోదీ... ఈ విషయాలను స్పష్టం చేయడంలో విఫలమైతే మీరు కపట నాటక సూత్రధారి అని నిర్ధారణ అవుతుంది...  మీ వాగ్దానాలు నమ్మశక్యం కానివి, మీ రాజకీయాల మాదిరిగానే కుటిలమైనవని తేలిపోతుంది... మీరు న్యాయం లేని వారు అని స్పష్టమవుతుంది అంటూ బొత్స సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Botsa Satyanarayana
Narendra Modi
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News