Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్.. నేడు బెంగళూరుకు ప్రజ్వల్ రేవణ్ణ.. విమానాశ్రయంలో పోలీసుల మోహరింపు

 Prajwal Revanna to fly Bengaluru To Surrender

  • సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ
  • ఇప్పటికే ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్
  • తండ్రి, న్యాయవాది సలహా మేరకే లొంగిపోతున్న ప్రజ్వల్

కర్ణాటక సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నేడు లొంగిపోయే అవకాశం ఉంది. నేడు  ఆయన బెంగళూరు విమనాశ్రయానికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు గత రాత్రి నుంచే విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మోహరించారు. 

33 ఏళ్ల ప్రజ్వల్ గత నెల 27న డిప్లొమాటిక్ పాస్‌పోర్టుపై దేశం విడిచి జర్మనీ వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రజ్వల్‌పై బ్లూకార్నర్ నోటీస్ జారీ అయింది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ఆయన జర్మనీ నుంచి బయలుదేరినట్టు వార్తలు వచ్చాయి. 

ప్రజ్వల్ దుబాయ్ నుంచి వస్తున్నట్టు అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది. తండ్రి, ఆయన న్యాయవాది సలహా మేరకే ప్రజ్వల్ లొంగిపోతున్నట్టు సమాచారం.

More Telugu News