Sunil Narine: నరైన్ బాదుడే బాదుడు... కేకేఆర్ భారీ స్కోరు

KKR posts 235 runs with Sunil Narine massive hitting

  • లక్నోలో కేకేఆర్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసిన కోల్ కతా
  • 39 బంతుల్లో 81 పరుగులు చేసిన నరైన్
  • చివర్లో 6 బంతుల్లో 25 పరుగులు చేసిన రమణ్ దీప్ సింగ్

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. నరైన్ బాదుడుతో కోల్ కతా భారీ స్కోరు సాధించింది. 

నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేయగా... కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 32, రఘువంశీ 32, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. 

ఆఖర్లో రమణ్ దీప్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 6 బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు రమణ్ దీప్ సింగ్ 1 ఫోరు, 3 సిక్సులు కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ 3 వికెట్లు తీశాడు. యశ్ ఠాకూర్ 1, రవి బిష్ణోయ్ 1, యుధ్ వీర్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

More Telugu News