Perni Nani: చంద్రబాబు హామీలతో జీతాలు ఇవ్వగలరా, లేదా అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు: పేర్ని నాని
- ఏపీలో నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
- ఇవాళ మచిలీపట్నంలో ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన పేర్ని నాని
- జగన్ పాలనలో ఉద్యోగులు ఎప్పుడూ అవమానపడలేదని వెల్లడి
- చంద్రబాబు హామీలను ఉద్యోగులు నమ్మడంలేదని వ్యాఖ్యలు
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కు నేడు రెండో రోజు కాగా, మచిలీపట్నంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఉద్యోగులు మానసిక వేదన అనుభవించారని, కానీ జగన్ పాలనలో ఉద్యోగులు ఎప్పుడూ అవమానపడలేదని అన్నారు.
ఈ ఎన్నికల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉద్యోగుల్లో నమ్మకం కలిగించడంలేదని... జీతాలు ఇవ్వగలరా, లేదా? అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారని పేర్ని నాని వివరించారు.
జగన్ ఇస్తున్న పథకాలతో మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారని, మరి చంద్రబాబు ఇచ్చే హామీలతో రాష్ట్రం ఇంకేమైపోతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ వైపే ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.