Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది

Tollywood Actor Vijay Devarakonda has announced a new movie

  • డైరెక్టర్‌ రవి కిరణ్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాలో నటించనున్న విజయ్
  • స్వయంగా వెల్లడించిన దర్శకుడు
  • అన్నీ స్టడీ చేసి.. చాలా టైమ్ తీసుకొని కథ రాశానని వెల్లడి

ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ రవి కిరణ్ స్వయంగా వెల్లడించాడు.

రెండవ సినిమా కావడంతో కొంచెం సమయం తీసుకొని చేస్తున్నానని ఆయన తెలిపారు. పొలిటికల్ డ్రామా కావడంతో ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏ పాయింట్ చెప్పినా ఏదో ఇచ్చాం అన్నట్టు కాకుండా పర్‌ఫెక్ట్‌గా చెప్పాలని నిర్ణయించుకున్నానని రవికిరణ్‌ కోలా వివరించారు. చూసే వాళ్లకు సిల్లీగా అనిపించకుండా గొప్పగా అనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ టైమ్ తీసుకొని రాశానని, చాలా బాగా వచ్చిందని  వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

కాగా ఈ సినిమాను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. డైరెక్టర్ రవికిరణ్ కోలా తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తోనే హిట్ అందుకున్నారు.

More Telugu News