Vijayawada Durga Temple: ఘోర అపచారం.. దుర్గ గుడిలో అధికారి రాసలీలలు

Engineering officer in Vijayawada Durga temple romance
  • మహిళా సెక్యూరిటీ సిబ్బందితో ఇంజినీరింగ్ అధికారి రాసలీలలు
  • వైరల్ అవుతున్న వీడియో
  • విచారణకు ఆదేశించిన ఆలయ ఈవో రామారావు
ప్రముఖ ఆథ్యాత్మిక క్రేత్రమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజినీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్ కు పిలిపించుకుని... వారు చేసిన చిన్నిచిన్ని తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబరుచుకుంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు ఇంజినీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటివి చోటుచేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Durga Temple
Officer
Romance

More Telugu News