Mini Swimming Pools: ఇంట్లోనే మినీ స్విమ్మింగ్ పూల్స్... సమ్మర్ లో పిల్లలకు హాయ్ హాయ్
- మండే ఎండల్లో పిల్లలు సేదదీరేందుకు మినీ స్విమ్మింగ్ పూల్స్
- ఖర్చు రూ.3 వేల లోపే!
- వివరాలతో వీడియో ఇదిగో!
వర్షాకాలం, శీతాకాలాన్ని ఆస్వాదించినంతగా మనం ఎండాకాలాన్ని ఎంజాయ్ చేయలేం. భానుడు నడినెత్తిన చండ్ర నిప్పులు కురిపిస్తుంటే రసాస్వాదన సంగతి వదిలేసి కాస్తంత చల్లని నీడ కోసం వెతుకుతాం.
పల్లెటూళ్లలో అయితే పిల్లలు వేసవి కాలాల్లో చెరువులు, నీటి కుంటల్లో దిగి జలకాలాడుతుంటారు. పట్టణాలు, నగరాల్లో అయితే పెద్దవాళ్లు తమ పిల్లలను స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులకు తీసుకెళుతుంటారు. సముద్ర తీరప్రాంతాలకు దగ్గర్లో ఉండేవాళ్లు బీచ్ లకు వెళుతుంటారు.
అయితే, ఇవేవీ అవసరం లేకుండా మన ఇంట్లోనే మినీ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసుకుంటే... అది కూడా కేవలం రూ.3000 లోపే అయితే... ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ స్పెషల్ స్విమ్మింగ్ పూల్స్ వివరాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా... ఇంకెందుకాలస్యం... ఈ వీడియో చూసేయండి.