Bandi Sanjay: బండి సంజయ్ పై ఫేక్ వీడియో, ఫేక్ కాల్ రికార్డింగ్ సృష్టించారని ఫిర్యాదు... కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు

Karimnagar police files case on Congress candidate

  • సంజయ్ పై డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డులు సృష్టించి సోషల్ మీడియా ఖాతాలో దుష్ప్రచారం చేశారని కేసు
  • రిటర్నింగ్ అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  • వెలిచాల రాజేందర్‌పై కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు

బీజేపీ ఎంపీ, కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్ పై ఫేక్ వీడియోను సృష్టించారనే ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డులు సృష్టించి తన సోషల్ మీడియాఖాతాలో దుష్ప్రచారం చేశారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.

బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన కరీంనగర్ టూటౌన్ పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమిత్ షా ఫేక్ వీడియో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోను ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జులను అరెస్ట్ చేశారు. వారికి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News