Harish Rao: తెలంగాణకు, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి: హరీశ్ రావు

Harish Rao says Revanth Reddy should thankful to kcr

  • సిద్దిపేట లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు... రాష్ట్రాన్ని తెచ్చిందే సిద్దిపేట అని వ్యాఖ్య
  • తెలంగాణ రావడానికి కారణమే కేసీఆర్ అన్న హరీశ్ రావు
  • ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రానికి, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిందే సిద్దిపేట అన్నారు. తన నియోజకవర్గం సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రావడానికి కారణమే కేసీఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి... రుణమాఫీని అమలు చేయండి... ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాల్‌పై స్పందించారు.

Harish Rao
BRS
Revanth Reddy
Congress
Lok Sabha Polls
  • Loading...

More Telugu News