Helicopter Crash: ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. త్రుటిలో బయటపడిన శివసేన (యూబీటీ) నేత.. వీడియో ఇదిగో!

Helicopter crashes in Raigad Shiv Sena UBT leader Sushma Andhare Escapped

  • ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే
  • ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్
  • ల్యాండ్ అవుతూ ఆమె కళ్ల ముందే కుప్పకూలిన వైనం
  • పైలట్‌కు తీవ్ర గాయాలు

శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అందారే త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో ఈ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన సుష్మ హెలికాప్టర్ కోసం వేచి చూస్తుండగా, ల్యాండ్ అవుతూ అది ఆమె కళ్ల ముందే కుప్పకూలింది. అంతకుముందు అది అదుపు తప్పి గాల్లో ఓ వైపుకు కొట్టుకుపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. 

హెలికాప్టర్ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ రూటర్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్ ల్యాండ్‌ సైట్‌కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో పక్కకు జారుకుంది. ఆపై ల్యాండ్ అవుతూ భూమిని ఢీకొట్టడంతో దుమ్ముధూళి ఒక్కసారిగా కమ్మేసింది.

More Telugu News