Gold: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఇలా..

Gold Rates In Hyderabad Today Are

  • 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధరపై రూ. 500, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 540 క్షీణత
  • అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఊగిసలాట
  • వెండి కిలో రూ. 87 వేలుగా నమోదు

హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65,750కి పడిపోగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 10 గ్రాములకు రూ. 540 క్షీణించి రూ. 71,730కి పడిపోయింది. వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ. 87 వేలుగా నమోదైంది. 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొన్ని వారాలుగా మార్కెట్లో పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 60 వేలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55 వేలకు అటూఇటూగా కదలాడాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. కాగా, ప్రస్తుతం పేర్కొన్న బంగారం ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. ఆ తర్వాత వీటి ధరలలో మార్పు ఉండే అవకాశం ఉంది.

Gold
Gold Rates
Gold Rates In Hyderabad
Billon Market
Hyderabad Bullion Market
  • Loading...

More Telugu News