Revanth Reddy: ఖర్గేతో కలిసి ఉత్తరప్రదేశ్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డి

Revanth Reddy and Mallikarjun Kharge went to Uttar Pradesh

  • రాయ్ బరేలీలో నేడు నామినేషన్ వేస్తున్న రాహుల్ గాంధీ
  • నామినేషన్ కార్యక్రమం కోసం బయల్దేరిన రేవంత్
  • ఒకే విమానంలో పయనమైన ఖర్గే, రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరప్రదేశ్ కు బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి యూపీకి బయల్దేరారు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రాయ్ బరేలీకి వెళ్లారు. సోనియాగాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమె స్థానం రాయ్ బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కిశోర్ లాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దించింది.

Revanth Reddy
Rahul Gandhi
Mallikarjun Kharge
Congress
Uttar Pradesh
  • Loading...

More Telugu News