Rahul Gandhi: ప్రజ్వల్ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi on Prajwal Revanna

  • సెక్స్ స్కాండల్ వివాదంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్
  • ఇది సామూహిక అత్యాచారం అన్న రాహుల్ గాంధీ
  • ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియో స్కాండల్ లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రజ్వల్ పై నిప్పులు చెరిగారు. హాసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశారని విమర్శించారు. ఈ నేరాన్ని ఆయన సామూహిక అత్యాచారంగా అభవర్ణించారు. ఇలాంటి చరిత్ర ఉన్న జేడీఎస్ పార్టీతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాహుల్ గాంధీ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.  

మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ స్కాండల్ బయటకు వచ్చిన వెంటనే ఆయన దేశాన్ని విడిచిపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే, సిట్ ముందుకు వచ్చేందుకు మరో ఏడు రోజుల గడువు కావాలని ప్రజ్వల్ కోరారు.

Rahul Gandhi
cong
Prajwal Revanna
JDS
BJP
  • Loading...

More Telugu News