Sujana Chowdary: మాటలు చెప్పలేను.. చేతల్లో చూపిస్తా: సుజనా చౌదరి

Sujana Chowdary meeting with Muslims

  • ముస్లిం సంఘాలతో సుజనా చౌదరి సమావేశం
  • ముస్లింలకు బీజేపీ అండగా ఉంటుందని వ్యాఖ్య
  • ముస్లింల సమస్యలు పరిష్కరిస్తానని హామీ

ముస్లింలకు బీజేపీ అండగా ఉంటుందని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ముస్లిం సంఘాలతో ఈరోజు సుజనా చౌదరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. 

అయితే, మోదీ ప్రధాని అయిన తర్వాత ముస్లింలలో ఆయన ఒక భరోసా కల్పించారని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లిం, క్రిస్టియన్, ఎండోమెంట్ ఆస్తులను కాపాడుకుందామని అన్నారు. ముస్లింల కోసం చేపట్టబోయే కార్యాచరణను కూడా ఈ సందర్భంగా సుజనా చౌదరి వివరించారు. నిర్దిష్ట కాల పరిమితితో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరిలా మాటలు చెప్పడం తనకు చేత కాదని... పని చేసి చూపిస్తానని చెప్పారు.

Sujana Chowdary
BJP
  • Loading...

More Telugu News