Duvvada Srinivas: వాలంటీర్లను ఉద్దేశించి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Duvvada Srinivas warns volunteers to resign

  • వాలంటీర్లు రాజీనామా చేయాలన్న దువ్వాడ శ్రీనివాస్
  • వైసీపీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారం చేయాలని వ్యాఖ్య
  • మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిక

ఏపీ ఎన్నికలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి... వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అన్నారు. 

ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుంచి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని దువ్వాడ అన్నారు. ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాలని చెప్పారు. తమ మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. టెక్కలిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నెల 10వ తేదీన వాలంటీర్ల విధులపై హైకోర్టు తీర్పును వెలువరించనుంది.

Duvvada Srinivas
YSRCP
Volunteers
  • Loading...

More Telugu News