Roja: రోజా వ్యతిరేకవర్గ నేతపై సస్పెన్షన్ వేటు

Roja opponent leader suspended

  • సొంత నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకవర్గం
  • వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీరెడ్డిపై వేటు
  • పార్టీని నమ్ముకున్నందుకు ఇలా అవమానిస్తారా? అని మురళీరెడ్డి ఆగ్రహం

నగరి నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి రోజా పట్టుదలగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారు. అయితే, ఆమెకు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకవర్గం ఉంది. వీరంతా ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తూ ఆమెను ఓడించేందుకు కృషి చేస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో, రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై పార్టీ చర్యలకు ఉపక్రమించింది. వడమాలపేటకు చెందిన జెడ్పీటీసీ మురళీరెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో ఈ చర్యలకు పూనుకున్నట్టు ఆయన తెలిపారు. 

మరోవైపు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మురళీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఇలా అవమానిస్తారా? అని మండిపడ్డారు. ఈ పరిణామాలు నగరి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

Roja
YSRCP
Nagari
  • Loading...

More Telugu News