Hari Hara Veera Mallu Teaser: 'హ‌రిహర వీర‌మ‌ల్లు' టీజ‌ర్ వచ్చేసింది!

Hari Hara Veera Mallu Teaser Released

  • "హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో టీజ‌ర్ విడుద‌ల‌
  • పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ 
  • కళ్ళు చెదిరే విజువల్స్, కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో టీజ‌ర్ అదుర్స్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వ‌స్తున్న‌ హరిహర వీరమల్లు మూవీ టీజర్ విడుద‌లైంది. ఈ మూవీని నిర్మిస్తున్న‌ మెగా సూర్య ప్రొడక్షన్స్ టీజ‌ర్‌ను విడుద‌ల‌ చేసింది. ఇక‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తాజాగా చిత్రం యూనిట్ ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేసింది. మొదటి భాగం "హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. "ధర్మం కోసం యుద్ధం" అనేది ఉపశీర్షిక. 

పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కల్యాణ్ పోషిస్తున్న 'హరిహర వీరమల్లు' పాత్రను టీజర్ లో చూపించారు. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనుంద‌ని తాజాగా విడుద‌లైన‌ టీజర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి పాత్రలో ప‌వ‌ర్ స్టార్ క‌నిపించున్నారు. వీరమల్లుగా వెండితెరపై పవన్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Hari Hara Veera Mallu Teaser
Pawan Kalyan
Tollywood

More Telugu News