Rinku Singh: టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్‌కు చోటుదక్కకపోవడంపై స్పందించిన తండ్రి

Rinku Singh Father Breaks Silence On Sons T20 World Cup Snub

  • చోటు దక్కుతుందని ఆశించాం.. స్వీట్లు, క్రాకర్లు కూడా తెచ్చుకున్నామన్న ఖాన్‌చంద్ర సింగ్
  • కొంచెం బాధగా ఉందన్న రింకూ తండ్రి
  • చోటు దక్కకపోవడంతో రింకూ సింగ్ గుండె బద్దలైందని వ్యాఖ్య

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్-2024లో ఆడబోయే భారత జట్టులో రింకూ సింగ్‌కి చోటు ఖాయమని అంతా భావించారు. క్రికెట్ మాజీలు అందరూ సింగ్ కచ్చితంగా జట్టులో ఉంటాడని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ సెలక్టర్లు ఆశ్చర్యపరిచారు. తుది జట్టులోనే కాదు.. 15 మంది సభ్యుల జట్టులో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రిజర్వ్‌ర్డ్ ఆటగాళ్ల జాబితాలో చోటి ఇచ్చారు. రింకూ సింగ్‌కి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు.

రింకూ సింగ్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందని ఆశించామని, అందుకే కొంచెం విచారంగా ఉందని ఖాన్‌చంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. రింకూ సింగ్‌కి చోటు దక్కితే సెలబ్రేట్ చేసుకోవడానికి ముందస్తుగా స్వీట్లు, క్రాకర్లు తెచ్చుకున్నామని తెలిపారు. తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనుకున్నాం కానీ అలా జరగలేదని అన్నారు. ‘భారత్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్‌చంద్రసింగ్ ఈ విషయాన్ని చెప్పారు. 

రింకూ ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించిగా ‘అతడి గుండె బద్దలైంది. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని తెలిశాక ముందుగా అమ్మకు రింకూ ఫోన్ చేశాడు. తుది జట్టులోనే కాదు.. 15 మంది సభ్యుల టీమ్‌లో కూడా చోటు దక్కలేదని చెప్పాడు. అయితే రిజర్వ్ ఆటగాడిగా జట్టుతో కలిసి ప్రయాణిస్తానని రింకూ వివరించాడు’’ అని ఖాన్‌చంద్ర సింగ్ వివరించారు.

కాగా రింకూకు చోటు కల్పించకపోవడంపై సెలెక్టర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన రింకూ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అదరగొడుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News