Posani Krishna Murali: జగన్ ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీ స్పందించలేదు: పోసాని కృష్ణమురళి ఫైర్

Chandrababu became God by joining hands with BJP says Posani
  • జగన్ ను చంపుతానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారన్న పోసాని
  • రెండు సీట్ల కోసం చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని ఎద్దేవా
  • చంద్రబాబు నుంచి జగన్ ను సీజేఐ కాపాడాలని విన్నపం
జగన్ ను చంపేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీకానీ, మేధావులు కానీ స్పందించలేదని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. కేవలం రెండు ఎంపీ సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన బీజేపీ... వేల కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఎన్ని వేల కోట్లయినా తినొచ్చా? అని ప్రశ్నించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని జగన్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ఓడించడం సాధ్యంకాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Posani Krishna Murali
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News