Roja: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే!: మంత్రి రోజా

Roja comments on alliance manifesto

  • నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్
  • సోషల్ మీడియాలో స్పందించిన రోజా
  • బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్య, భవిష్యత్ ప్రశ్నార్థకమేనన్న రోజా
  • ఆ మాట టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని వివరణ 

నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయడంపై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ మేనిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాలను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే అంటూ వివరించారు. 

ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు, ఐబీ సిలబస్ ఉండదు, పౌష్టికాహారం పెట్టే గోరుముద్ద ఉండదు, కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇవ్వరు, ఇంగ్లీషులో బాగా రాణించేందుకు బైలింగ్యువల్ బుక్స్ ఉండవు... అంటూ రోజా ఏకరవు పెట్టారు. 

అయితే ఇవన్నీ తాను చెప్పడంలేదని, టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని పేర్కొన్నారు. అంటే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లల భవిష్యత్, వారి మంచి చదువులు... ప్రశ్నార్థకమే కదా... ఆలోచించండి అంటూ రోజా ట్వీట్ చేశారు. 

Roja
Manifesto
YSRCP
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News