Anupam Kher: జూనియర్ ఎన్టీఆర్ పై అనుపమ్ ఖేర్ ఆసక్తికర ట్వీట్

Anupam Kher tweet on Junior NTR

  • 'వార్ 2' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్
  • తారక్ ను కలిసిన అనుపమ్ ఖేర్
  • తారక్ ఎదుగుదల సంతోషంగా ఉందన్న అనుపమ్ ఖేర్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్పుడు ముంబైలో బేస్ పెంచుకునే పనిలో తారక్ ఉన్నారు. 'వార్ 2' బాలీవుడ్ మూవీలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల తన భార్య ప్రణతితో కలిసి ఓ డిన్నర్ పార్టీకి తారక్ వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 

తాజాగా తారక్ ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. తారక్ ను కలిసిన ఫొటోను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఫేవరెట్ పర్సన్ తారక్ ను కలవడం సంతోషంగా ఉందని అనుపమ్ ఖేర్ అన్నారు. తారక్ పని చేసే విధానం తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు. తారక్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.  

Anupam Kher
Junior NTR
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News