Nara Lokesh: నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది... దాని పేరు బ్యాండేజ్ బబ్లూ!: నారా లోకేశ్ వ్యంగ్యం

Lokesh satires on Jagan

  • ఒంగోలులో యువగళం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • ఇటీవలి వరకు నుదుటిపై బ్యాండేజ్ తో దర్శనమిచ్చిన సీఎం జగన్
  • ఇప్పటికే భాస్కర్ అవార్డు వచ్చేసిందన్న నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇవాళ యువగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఇటీవలి వరకు సీఎం జగన్ నుదుటన బ్యాండేజితో తిరగడంపై వ్యంగ్యం ప్రదర్శించారు. "నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది. దాని పేరు బ్యాండేజ్ బబ్లూ. యాక్టర్ ఎవరో తెలుసా... జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా... భారతీరెడ్డి గారు! డైరెక్షన్ మొత్తం ఐప్యాక్! ఇప్పటికే భాస్కర్ అవార్డులు కూడా వచ్చేశాయి! తొందర్లో ఆస్కార్ అవార్డు కూడా ఖాయం!" అంటూ ఎద్దేవా చేశారు.

Nara Lokesh
Yuvagalam
Ongole
TDP
  • Loading...

More Telugu News