Harish Rao: ఆ మాట చెప్పిన రేవంత్ రెడ్డి గద్దలను మాత్రం ఎత్తుకెళ్లారు: హరీశ్ రావు

Harish Rao counter to Revanth Reddy

  • కేసీఆర్ ఇంటిపై వాలిని కాకిని తన ఇంటిపై వాలనీయనన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారేనన్న హరీశ్ 
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారని విమర్శ 

కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని తన ఇంటిపై వాలనీయనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మాత్రం గద్దలను ఎత్తుకెళ్లారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సీఎం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తన ఇంటిపై కూడా వాలవద్దని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ముఖ్యమంత్రి కాకులను వాలనీయనని అనడం విడ్డూరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు.

Harish Rao
Telangana
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News