Harish Rao: కాంగ్రెస్ అసమర్థత వల్ల కరెంట్ సరిగ్గా రావడం లేదు: హరీశ్ రావు

Harish rao blames congress government over power issues
  • కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాసిందని ఆగ్రహం
  • కార్మికుల వ్యతిరేక పార్టీగా బీజేపీకి ముద్రపడిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో కూడా అమలు చేయలేదని ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల కరెంట్ సరిగ్గా రావడం లేదని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ఆటో యూనియన్ నేతలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాసిందన్నారు. కార్మికుల వ్యతిరేక పార్టీగా బీజేపీకి ముద్రపడిందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో కూడా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఓటుతో శిక్షించాలన్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 మంది ఆటో కార్మికులు చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థత వల్ల కరెంట్ సరిగ్గా రావడం లేదన్నారు.
Harish Rao
BRS
Congress
BJP

More Telugu News