Thotapalli Madhu: దూసుకుపోతున్న ఇంటర్వ్యూ .. దుమారం రేపుతున్న మాటలు!

Thotapalli Madhu Interview

  • రచయితగా అనేక చిత్రాలకు పనిచేసిన తోటపల్లి మధు 
  • ఒక ఇంటర్యూలో అనేక అంశాలపై మాటలు 
  • చనిపోయిన వ్యక్తుల గురించిన ప్రస్తావన 
  • అసహనంతో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు

ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన తోటపల్లి మధు, ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ఒక విషయానికీ .. మరో విషయానికి ముడిపెడుతూ ఆయన చాలామంది నటీనటుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సావిత్రి తినేసి .. తాగేసి లావైపోయారు. బి. సరోజాదేవి తనని దాటుకుని ముందుకు వెళ్లడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు" అని ఆయన అన్నారు. 

సావిత్రి మాదిరిగానే శ్రీదేవి కూడా మద్యం ఎక్కువగానే తీసుకుంటుందనీ, ఐశ్వర్య రాయ్ తనని దాటేసి వెళ్లడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని అన్నారు. గ్లామర్ గా కనిపించడం కోసం, శ్రీదేవి చాలా సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పారు. ఇక శోభన్ బాబు దానాలు పెద్ద మొత్తంలో చేసేవారు అంటూనే, జయలలిత ద్వారా ఆయనకి ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎంజీఆర్ ఎందుకు ఆ టోపీ పెట్టుకుంటారు? అనే విషయాలపై కూడా మాట్లాడారు.

 జయసుధ తనతో సీరియల్ రాయించుకుని అతికష్టం మీద పాతికవేలు ఇచ్చారని చెప్పారు. తాను .. వాణివిశ్వనాథ్ వివాహం చేసుకోవడానికి గుడికి వెళ్లామనీ, ఆ రోజున గ్రహణం కావడం వలన గుడి మూసి ఉండటంతో తమ పెళ్లి జరగలేదని చెప్పాడు. ఇలా ఈ ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన వ్యక్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల, ఇండస్ట్రీ పెద్దలు అసహనంతో .. అసంతృప్తితో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Thotapalli Madhu
Writer
Tollywood
Savitri
Sridevi
  • Loading...

More Telugu News