Khushboo: 'బాక్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఇదే: నటి ఖుష్బూ

Khushboo Interview

  • ఖుష్బూ నిర్మాతగా రూపొందిన 'బాక్'
  • మే 3వ తేదీన భారీ స్థాయి విడుదల 
  • తమన్నా ప్రత్యేక ఆకర్షణ అవుతుందని వ్యాఖ్య 
  • నిర్మాతగా హ్యాపీగా ఉన్నానని వెల్లడి


తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ, ఇప్పుడు తన స్థాయికి తగిన కేరక్టర్ రోల్స్ చేస్తూనే, నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఖుష్బూ భర్త సుందర్ సి. 'అరణ్మనై' అనే సిరీస్ పై వరుస కథలను తెరపైకి వదులుతూ వెళుతున్నారు. ఆ సినిమాలకి  ఖుష్బూ నిర్మాతగా ఉంటున్నారు. 'అరణ్మనై 4' ఇప్పుడు 'బాక్' అనే పేరుతో మే 3వ తేదీన తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఖుష్బూ బిజీగా ఉన్నారు. తాజాగా 'మహా మ్యాక్స్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఖుష్బూ' మాట్లాడుతూ, "తెలుగులో ఈ సినిమాకి 'బాక్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి? అని చాలామంది అడుగుతున్నారు. 'బాక్ అనేది ఈ సినిమాలోని దెయ్యం పేరు. అస్సాం జానపద కథలను పరిశీలిస్తే ఈ పేరుతో అక్కడి దెయ్యం కథలు ఎక్కువగా వినిపిస్తాయి. ఆ ప్రేరణతో తయారు చేసిన కథ కావడం వలన 'బాక్' అనే పేరు పెట్టడం జరిగింది" అని అన్నారు. 

"ఈ సిరీస్ లో ముందుగా హన్సిక .. ఆ తరువాత త్రిష .. ఇప్పుడు రాశిఖన్నా .. తమన్నాను తీసుకోవడం వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదు. కథను బట్టి ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. తమన్నా పాత్ర ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. నేను .. సిమ్రాన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తాం. పోస్టర్స్ లో నేను కనిపించను .. నిర్మాతగా పోస్టర్ పై నా పేరు చూసుకోవడంలోనే నాకు సంతృప్తి ఉంది" అని చెప్పారు.

More Telugu News