Allari Naresh: అలాంటి సినిమాలు చేయవద్దని అమ్మ ఏడ్చింది: 'అల్లరి' నరేశ్

Allari Naresh Interview

  • 61 సినిమాలు పూర్తిచేసిన 'అల్లరి' నరేశ్
  • మే 3వ తేదీన 'ఆ ఒక్కటీ అడక్కు' రిలీజ్ 
  • 'నా సామిరంగ' చూసి తల్లి ఏడ్చిందని వెల్లడి 
  • చనిపోయే పాత్రలు చేయనని చెప్పానని వివరణ   


అల్లరి నరేశ్ ఇంతవరకూ 61 సినిమాలు చేశాడు. చాలా వేగంగా ఈ సంఖ్యను చేరుకున్న హీరో ఆయన. ఆ మధ్య కాస్త సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన నరేశ్. మళ్లీ ఇప్పుడు కామెడీ ప్రధానంగా నడిచే 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా చేశాడు. రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకి మల్లి దర్శకత్వం వహించాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా చేసిన ఈ సినిమా, మే 3వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. 

"ఒక వైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వెళుతున్నాను. కొన్ని సీరియస్ సినిమాల తర్వాత మళ్లీ కామెడీ కంటెంట్ తో వస్తున్నాను. ఈ సినిమాలో మా జోడీ చూసిన వాళ్లంతా చాలా పెర్ఫెక్ట్ గా సెట్టయ్యారు అని అంటున్నారు. ఫరియాకి మంచి కామెడీ టైమింగ్ ఉంది. తను మంచి డాన్సర్ కావడం వలన, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ను కూడా చాలా బాగా ఇస్తోంది. తప్పకుండా ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకువస్తుంది" అని అన్నాడు. 

"ఇక టీవీలో 'నా సామిరంగ' వస్తుంటే, మా అమ్మా .. మా ఆవిడ చూశారు. ఆ సినిమాలో నేను చనిపోయే సీన్ ఉంది. చనిపోయాక స్నానం చేయించడం .. పాడెపై పడుకోబెట్టడం .. వంటి సీన్స్ ఉన్నాయి. అది చూసి అమ్మ ఏడ్చేసింది. ఇకపై చనిపోయే పాత్రలు చేయవద్దని చెప్పింది .. సరేనని చెప్పి ఆమెను ఓదార్చాను. సినిమాల్లో అలాంటివి సహజమని ఆమెకు తెలుసు. కానీ ఆ రోజున ఆమె ఎందుకనో ఎమోషనల్ అయింది" అని చెప్పాడు.

More Telugu News