Rohit Sharma: రోహిత్ శ‌ర్మ తెలుగు మాట్లాడ‌టం విన్నారా?.. ఇదిగో వీడియో!

Indian Captain Rohit Sharma Telugu Talking Video goes Viral on Social Media

  • హైద‌రాబాద్‌ అభిమానుల కోసం తెలుగులో మాట్లాడిన హిట్‌మ్యాన్‌
  • తెలుగు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అంద‌రూ బాగున్నారా? అంటూ ఫ్యాన్స్‌ను ప‌ల‌క‌రించిన రోహిత్‌
  • భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ తెలుగులో మాట్లాడిన వీడియో నెట్టింట వైర‌ల్‌

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తెలుగు మూలాలున్న వ్య‌క్తి అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌ల్లి పూర్ణిమ శ‌ర్మ ఏపీలోని విశాఖ‌ప‌ట్నంకు చెందిన‌వారే. అయితే, హిట్‌మ్యాన్‌కు తెలుగు పెద్ద‌గా రాదు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఇటీవ‌ల న‌గ‌రానికి వ‌చ్చిన‌ రోహిత్‌ను కొంత‌మంది తెలుగు అభిమానులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం తెలుగులో మాట్లాడారు. 

'తెలుగు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అంద‌రూ బాగున్నారా? నేను హైద‌రాబాద్ వ‌చ్చాను?' అంటూ వ‌చ్చీరాని తెలుగులో హిట్‌మ్యాన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక రోహిత్ నేడు 37వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. దీంతో అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా భారీగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ గెలిచి దేశానికి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు.

More Telugu News