Pulivarthi Nani: టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం

AP High Court orders to give security to TDP candidate Pulivarthy Nani

  • పులివర్తి నానికి 1 ప్లస్ 1 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
  • కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశం
  • నాని తరపున వాదనలు వినిపించిన ఉమేశ్ చంద్ర

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1 ప్లస్ 1 భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు, తన కుటుంబ సభ్యులకు హాని ఉందని భద్రతను కల్పించాలని నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరినా కల్పించలేదని పిటిషన్ లో తెలిపారు. పులివర్తి నాని తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో పులివర్తి నానికి 2 ప్లస్ 2 భద్రత కల్పించారని... ఆ తర్వాత తొలగించారని వాదనల సందర్భంగా కోర్టుకు ఉమేశ్ చంద్ర తెలిపారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా స్పందించలేదని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు నానికి 1 ప్లస్ 1 భద్రతను కల్పించాలని ఆదేశించింది.

More Telugu News