Chennai: వావ్.. అంద‌రూ క‌లిసి నెల‌ల చిన్నారిని కాపాడారు.. వైర‌ల్ వీడియో!

Dramatic Rescue Of Baby Stuck On Tin Roof Of Chennai Apartment

  • చెన్నైలో నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు జారిప‌డ్డ ఏడు నెల‌ల చిన్నారి
  • అదృష్ట‌వ‌శాత్తూ మ‌రో అంత‌స్తు అంచున ప‌డి ఆగిన పాప‌
  • తిరుముల్లైవాయల్‌లోని హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఘ‌ట‌న

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఓ ఏడు నెల‌ల చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తూ అపార్ట్‌మెంట్ నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు జారింది. అదృష్ట‌వ‌శాత్తూ మ‌రో అంత‌స్తు అంచున ప‌డి ఆగింది. దీంతో చిన్నారిని ర‌క్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని ప‌లువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు పట్టుకుని కొంత‌మంది కింద నిల్చున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు వ్య‌క్తులు పైకెక్కి చిన్నారిని ర‌క్షించారు. తిరుముల్లైవాయల్‌లోని హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. పాప‌ను ర‌క్షించిన వారిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

More Telugu News