Yogendranath Posani: టీడీపీలో చేరిన పోసాని సోదరుని కుమారుడు

Posani Krishnamurali brothers son yogendranath joins TDP

  • చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన యోగేంద్రనాథ్ పోసాని
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత
  • చంద్రబాబు విజన్ ఏపీ అభివృద్ధికి అవసరమన్న యోగేంద్రనాథ్

ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్టు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్‌లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి టీడీపీపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడి కుమారుడు టీడీపీవైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది.

Yogendranath Posani
Telugudesam
Chandrababu
Posani Krishna Murali
YSRCP
  • Loading...

More Telugu News