Narendra Modi: 'ఇండియా' కూటమి ప్లాన్ ఇదే: ప్రధాని మోదీ

PM Modi satires on Congress led INDIA Bloc

  • మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ
  • కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిపై విమర్శలు
  • కర్ణాటక నమూనాను దేశమంతా అమలు చేస్తారని ఎద్దేవా 

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అనేది ఇండియా కూటమి ప్లాన్ అని ఎద్దేవా చేశారు. అందుకు కర్ణాటక నమూనానే నిదర్శనం అని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అధికారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య రెండున్నరేళ్ల చొప్పున పంచారని ప్రధాని మోదీ వివరించారు. ఇదే విధానాన్ని ఇండియా కూటమి దేశమంతా అమలు చేస్తుందని ఎత్తిపొడిచారు. 

ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయినా ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు పాలించాలన్న ఆలోచన మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ దిగజారిపోయిందని మోదీ విమర్శించారు.

More Telugu News