Maruti Suzuki: అందుబాటు ధరలో హైబ్రిడ్ కారు తీసుకువస్తున్న మారుతి

Maruti Suzuki set bring Hybrid Car

  • హైబ్రిడ్ కార్ల సాంకేతికత అభివృద్ధి చేస్తున్న మారుతి సుజుకి
  • ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఇది అధిక మైలేజి ఇస్తుందన్న మారుతి సుజుకి చైర్మన్
  • ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తే ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడి

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో చిన్నపాటి హైబ్రిడ్ కారును తీసుకువస్తోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ధరను నిర్ణయిస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. పైగా ఇది ప్రస్తుతం ఉన్న కార్ల కంటే అధిక మైలేజి ఇస్తుందని తెలిపారు. 

వివిధ హైబ్రిడ్ కార్లలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అధిక వ్యయంతో కూడుకున్నదని, అందుకే హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా ఉంటున్నాయని తెలిపారు. తాము తక్కువ ఖర్చుతో హైబ్రిడ్ కార్ల సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని భార్గవ వివరించారు. 

కేంద్రం కూడా సహకరించి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని, అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. మారుతి సుజుకి సంస్థ  త్రైమాసికం ఫలితాల వెల్లడి సందర్భంగా ఆర్సీ భార్గవ ఈ వ్యాఖ్యలు చేశారు.

Maruti Suzuki
Hybrid Car
Automobile
India
  • Loading...

More Telugu News