Amani: నా భర్త నుంచి విడిపోవడానికి కారణం ఇదే: ఆమని

Amani reveals the reason for seperation with her husband

  • తమిళ నిర్మాత మొహియుద్దీన్ ను పెళ్లాడిన ఆమని
  • పెళ్లైన తర్వాత భర్త కోసం సినిమాలకు దూరమైన ఆమని
  • ఒక అండర్ స్టాండింగ్ తో విడిపోయామని వెల్లడి

తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి ఆమని... 'జంబలకిడిపంబ' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమని ఎన్నో ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనతో పాటు అందం కూడా ఉండటంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. గ్లామరస్ పాత్రలతో పాటు ఎన్నో ఫ్యామిలీ చిత్రాల్లో ఆమె నటించారు. తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.  

పెళ్లైన తర్వాత ఆమని సినిమాలకు దూరమయింది. నటించడం భర్తకు ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసింది. అయితే, ప్రస్తుతం ఆమని, ఆమె భర్త విడివిడిగా ఉంటున్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని... అందుకే విడిపోవాలనుకున్నామని ఆమని చెప్పారు. విడాకులు తీసుకోకపోయినా... ఒక అండర్ స్టాండింగ్ తో విడిపోయామని తెలిపారు. ఇప్పటికీ టచ్ లోనే ఉన్నామని, అప్పుడప్పుడు కలుస్తుంటామని చెప్పారు. పిల్లలు మాత్రం తన వద్దే ఉంటారని... వాళ్లే తన ప్రపంచం అని అన్నారు. సినిమాలు, షూటింగ్ ల వల్ల పిల్లలకు కాస్త దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. ఆమని సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Amani
Tollywood
Husband
  • Loading...

More Telugu News