Naresh: 'అలగా జనం' అని వైసీపీ పేర్కొన్న వాళ్లే ఇప్పుడు గేమ్ చేంజర్లు అవుతున్నారు: నరేశ్

Naresh comments on AP politics

  • ఏపీ రాజకీయాలపై నరేశ్ ఆసక్తికర ట్వీట్
  • గత ఎన్నికల్లో పవన్ కోసం ప్రచారం చేసిన మైనర్లు ఇప్పుడు మేజర్లు అయ్యారని వెల్లడి
  • ఓటుతో ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్య 

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసిన మైనర్లను వైసీపీ వాళ్లు 'అలగా జనం' అని వ్యాఖ్యానించారని వెల్లడించారు. నాటి మైనర్లే ఇప్పుడు మేజర్లు అయ్యారని, ఓటు వేసి ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతున్నారని నరేశ్ పేర్కొన్నారు. 

ఈ 'జనం' ఈసారి ఎన్నికల్లో తియ్యని ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, తియ్యని విజయం సాధించబోతున్నారు అని వివరించారు. 

"ఐప్యాక్ సర్వే ప్రకారం... రాబోయే ఎన్నికల్లో విద్యార్థుల ఓట్లలో జగన్ కు 22 శాతం, కూటమికి 78 శాతం వస్తాయట. నా మాటలు గుర్తుపెట్టుకోండి...  ఈ ఎన్నికల్లో యువత గేమ్ చేంజర్ కానుంది" అంటూ నరేశ్ వివరించారు.

More Telugu News