Kesineni Nani: టీడీపీపై విమర్శలు గుప్పించిన కేశినేని నాని, దేవినేని అవినాశ్

Kesineni Nani and Devineni Avinash comments on TDP

  • విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ చేసిందేమీ లేదన్న కేశినేని నాని
  • ఎన్నికల తర్వాత టీడీపీ కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిందేనని వ్యాఖ్య
  • ప్రజల దీవెనలు వైసీపీకి ఉన్నాయన్న దేవినేని అవినాశ్

పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ చేసిందేమీ లేదని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విమర్శించారు. ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గ ప్రజలకు దేవినేని అవినాశ్ ఎంతో చేశారని చెప్పారు. టీడీపీ పని అయిపోయిందని... ఎన్నికల తర్వాత మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిందేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

టీడీపీ కంచుకోట విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా వైసీపీకే ప్రజల మద్దతు లభిస్తోందని దేవినేని అవినాశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాలనీ ప్రాంతంలో కూడా వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం సఫలమయిందని చెప్పారు. ప్రజల దీవెనలు వైసీపీకి ఉన్నాయని... సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనసైనికులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోసం చేశారని... అందుకే వైసీపీ పట్ల జనసైనికులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

Kesineni Nani
Devineni Avinash
YSRCP
Gadde Rammohan
Telugudesam
  • Loading...

More Telugu News