Vanga Geetha: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారు: వంగా గీత

Vanga Geetha fires on Pawan Kalyan

  • పిఠాపురంలో పవన్ పై పోటీ చేస్తున్న వంగా గీత
  • పిఠాపురంకు పవన్ రౌడీయిజాన్ని అంటకట్టారని విమర్శ
  • పార్టీ సమస్యలను పరిష్కరించేందుకు మిథున్ రెడ్డి వస్తుంటారని వ్యాఖ్య

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ తరుపున వంగా గీత నిలబడ్డారు. ఇరు పార్టీల శ్రేణులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా వంగా గీత మాట్లాడుతూ... మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా పవన్ కల్యాణ్, నాగబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 తనను తిడుతున్నారని చెప్పుకుని పవన్ కల్యాణ్ జాలి పొందాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బ్లేడ్లతో దాడి చేస్తున్నారంటూ పిఠాపురం నియోజకవర్గానికి రౌడీయిజాన్ని అంటకట్టారని విమర్శించారు. కడప మనుషులు పిఠాపురంకు వస్తున్నారని అంటున్నారని... ఒక ఏడాది కాలంగా తమ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అని... నియోజకవర్గ పార్టీ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన వచ్చి వెళ్తుంటారని చెప్పారు. 

Vanga Geetha
Mithun Reddy
YSRCP
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News