Nara Lokesh: నుదుటిపై బ్యాండేజ్ లేకుండా కనిపించిన సీఎం జగన్... నారా లోకేశ్ స్పందన

Nara Lokesh responds on CM Jagan seen without bandage

  • ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి
  • అప్పటి నుంచి నుదుటన బ్యాండేజితో దర్శనమిస్తున్న సీఎం జగన్ 
  • మేనిఫెస్టో విడుదల వీడియోలో బ్యాండేజి లేకుండా కనిపించిన వైనం

ఏపీ సీఎం జగన్ విజయవాడలో రాయి దాడి జరిగినప్పటి నుంచి నుదుటిపై బ్యాండేజితో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ నుదుటన బ్యాండేజి లేకుండా కనిపించారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

"ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం... జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం" అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ క్లోజప్ ఫొటోలను కూడా లోకేశ్ పంచుకున్నారు. 

సీఎం జగన్ పై ఏప్రిల్ 13 రాత్రి విజయవాడ సింగ్ నగర్ వద్ద రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో సీఎం జగన్ నుదుటిపై ఎడమవైపున గాయం కాగా, అదే రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కూడా తగిలి గాయమైనట్టు చెబుతున్నారు. 

కాగా, సీఎం జగన్ గాయంపై విపక్ష నేతలు నిన్నటిదాకా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా... అలాంటి దెబ్బలకు బ్యాండేజి వేస్తే చీము పట్టి సెప్టిక్ అవుతుందని, ఇక బ్యాండేజి తీసేయొచ్చని సలహా ఇచ్చారు.

Nara Lokesh
Jagan
Bandage
Stone Attack On Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News